ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. తాజాగా త్రిపుర ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించిన 2800 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
సౌత్ కొరియా విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలు బయటి నెట్‌వర్క్‌లకు అనుసంధానమైన తమ మంత్రిత్వ శాఖ కంప్యూటర్లలో చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ డీప్‌సీక్ వాడకాన్ని నిలుపుదల చేశాయి.
విదేశాంగ మంత్రి జై శంకర్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సెక్రటరీ జనరల్ నుర్లాన్ ఎర్మక్ బేయేవ్ తో భేటీ అయ్యారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.