భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇద్దరూ ఇద్దరే మ్యాచ్ లో వీరిద్దరి మధ్య కనిపించే దూకుడు స్వభావం ఒకప్పటి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంటర్నేషనల్ లీగ్ టీ 20 లీగ్ సందర్భంగా ఒకరినొకరు నెట్టుకుంటూ సరదాగా బాహాబాహీకి దిగిన ఒక వీడియో నెట్టింట నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షోయబ్ అక్తర్ తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ కి మేము ఇలా సిద్దమవుతున్నాం అంటూ ఆసక్తికర క్యాప్షన్ ను ఆయన ఈ వీడియోకు జత చేసారు. ఇక ఈనెల 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న తలపడనున్నాయి.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025