తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సీబీఐ సిట్ అధికారులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.అయితే ఉత్తరాఖండ్ రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్, పొమిల్‌తో పాటుగా తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా రాజు రాజశేఖరన్‌లు…తిరుపతి జల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడాలను సీబీఐ సిట్ అధికారులు తిరుపతిలో అరెస్టు చేశారు.
కాగా ఈ నలుగుర్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి…రాత్రి 10.30కు తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.ఈ మేరకు నలుగురికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నమోదైన కేసులో నలుగుర్ని అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.