ఎన్టీఆర్ దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను పాప్ సింగర్ షీరన్ స్టేజీ మీద పాడారు.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జూ.ఎన్టీఆర్ కూడా ఇంస్టాగ్రామ్ లో ఆ వీడియోను స్టోరీలో షేర్ చేస్తూ … సంగీతానికి హద్దులు లేవని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం ప్రత్యేకమంటూ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టొఫర్ షీరన్ కు థాంక్స్ చెప్పారు.బ్రిటన్ కు చెందిన షీరన్ ఇటీవల బెంగళూరులో కాన్సర్ట్ నిర్వహించారు.నిన్న జరిగిన ఈవెంట్ లో ‘ఎందుకు పుట్టిందో పుట్టింది’ అంటూ ఆయన తెలుగులో పాడారు.శిల్పారావుతో గొంతు కలిపారు.వీరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. మధ్యలో ప్రేక్షకులు కోరస్ గా ‘ఆ’ అంటూ అరుస్తూ కేకలు పెట్టారు. బ్రిటీష్ యాసతో షరీన్ నోట చుట్టమల్లే పాట డిఫరెంట్ గా వినిపించింది.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

