ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదని పని చేసే పద్దతుల్లో మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. నేడు పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ సమావేశానికి సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. వివిధ దేశాల అధినేతలు, సాంకేతిక రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐ విషయంలో అన్ని దేశాలు కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏఐ తో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలంటే అది స్థానికంగా ఉన్న వ్యవస్థలలోకి చొచ్చకుపోవాలని అన్నారు. అందుబాటు ధరలలో 140 కోట్ల మంది ప్రజల కోసం భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విజయవంతంగా నిర్మించింది. ఏఐ తో ఉద్యోగాలకు ముప్పు లేదని కొత్త టెక్నాలజీ వలన ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదని చరిత్ర ఇదే చెబుతుందని పని చేసే విధానం మారుతుందని కొత్త రకం ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరమని నైపుణ్యాలు పెంచుకునేవారికే ఉన్నతావకాశాలు ఉంటాయని అన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం వైపు భారత్ దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ఏఐతో ఉద్యోగాలు పోతాయనేది సరికాదు… కొత్తవి వస్తాయి: ప్రధాని మోడీ
By admin1 Min Read