అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. తన 20 ఏళ్ల వయసులోనే సత్యేంద్ర దాస్ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. 85 ఏళ్ల సత్యేంద్ర దాస్ ఈ నెల 3న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను లక్నోలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు ఆయన కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు.అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుండే ఆయన రామమందిర అర్చకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత
By admin1 Min Read
Previous Articleకొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Next Article కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ విడుదల వాయిదా…!