ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వన్డే ఫార్మాట్ విశ్వ విజేత ఆస్ట్రేలియా తన స్క్వాడ్ ను ప్రకటించింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ టోర్నీ బరిలోకి దిగనుంది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, పేసర్ హేజల్ వుడ్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాలతో తప్పుకున్నారు. మొదట ప్లేస్ దక్కించుకున్న మార్కస్ స్టోయినీస్ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్క్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఇక వీరంతా లేకుండా ఆస్ట్రేలియా తమ జుట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా టీమ్:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెస్గుర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సన్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. ట్రావెల్ రిజర్వ్: కూపర్ కొన్నోల్లీ
Previous Articleకిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ విడుదల వాయిదా…!
Next Article రామ్ చరణ్ కొత్త చిత్రానికి క్రేజీ టైటిల్…?