మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.అయితే RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర చిత్రీకరణ జరుపుకుంటుంది.కాగా ఈ సినిమాను దర్శకుడు క్రీడ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఇందులో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి జోరుగా వినిపిస్తోంది.ఈ చిత్రానికి ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.
ఈ సినిమా కథ క్రికెట్ ఆట చుట్టూ తిరుగుతుందని..అందుకే ఈ టైటిల్ ను
ఖరారు చేయాలనీ చిత్రబృందం భావిస్తుందని చెబుతున్నారు.అయితే ఇందులో కుస్తీకి సంబంధించిన నేపథ్యం కూడా ఉండనుందని తెలుస్తోంది.కాగా ఈ చిత్రానిక పవర్ క్రికెట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా..అనేది చూడాలి.ఇందులో రామ్ చరన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.