మెడికల్ కాస్ట్ తగ్గాలని మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందని వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. అనవసరంగా హాస్పిటల్ లో ఉంచి రూం బిల్లులు వసూలు చేసే విధానం మారాలన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా, అవసరమైతేనే హాస్పిటల్ కు పేషంట్ ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా అలోచించి, వైద్య ఖర్చులు తగ్గించాలని అన్నారు. ప్రతీ కుటుంబంలో ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని 1995లో చెప్పిన విషయం ఈసందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దాని ఫలితాలు ఇవాళ మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు.1995లో ఐటీ గురించి నేడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. భవిష్యత్‍లో ప్రపంచాన్ని ఏఐ శాసించబోతుందని మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని ముఖ్యం కాదు.. మన దగ్గర ఎంత డేటా ఉందన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో ప్రైవేటు సేవలు అనుసంధానంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసమే మేము పని చేస్తున్నామని తెలిపారు.
మెడికల్ కాస్ట్ తగ్గాలి…పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read