ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ ద్వారా సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనే భక్తులు 9552300009 నంబర్ కు వాట్సప్ సందేశం పంపి సేవలను పొందవచ్చని తెలిపింది. వాట్సప్ దేవాదాయ శాఖ ఆప్షన్ ఎంచుకున్న అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అందించే దర్శనం టికెట్లు, డొనేషన్, వివిధ సేవలను నగదు చెల్లించి పొందవచ్చని స్పష్టం చేసింది.మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమయైన సంగతి తెలిసిందే. మొదటి వారం రోజుల్లోనే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల వంటి ముఖ్యమైన ఆలయాలలో దర్శనాలు, పూజలు, విరాళాలు, వసతి, ప్రయాణం వంటి సౌకర్యాలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Previous Articleమెడికల్ కాస్ట్ తగ్గాలి…పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article దివంగత చమన్ అరోరాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు