నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి నెలలో చివరి ఆదివారం ఆయన “మన్ కీ బాత్” అనే రేడియో కార్యక్రమం ద్వారా ప్రజలతో తన భావాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రేడియో అనేక మంది వ్యక్తులకు శాశ్వతమైన జీవన రేఖగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు విషయాలు తెలియజేయడం, ప్రజలను అనుసంధానం చేయడం వార్తలు, సంస్కృతి, సంగీతం, కథ చెప్పడం ఇలా రేడియో అనేది సృజనాత్మకతను వ్యక్తం చేయడానికి శక్తివంతమైన మాధ్యమమని వివరించారు. రేడియో ప్రపంచంతో అనుబంధం ఉన్న వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న జరగనున్న #MannKiBaat కోసం మీ ఆలోచనలు మరియు ఇన్‌పుట్‌లను పంచుకోవాలని కోరారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు
By admin1 Min Read