బ్రెజిల్ లో ఇటీవల జరిగిన ఒక వేలంలో ఒంగోలు జాతి గిత్త రికార్డు స్థాయిలో రూ.41 కోట్లు ధర పలికి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు హార్షం వ్యక్తం చేశారు. ఒంగోలు జాతి గిత్త ప్రపంచ వేదికపై తన సత్తాను చాటిందని కొనియాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వాన్ని ప్రపంచానికి చూపిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 41 కోట్లు సంపాదించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒంగోలు పశువులు దాని ఉన్నతమైన జన్యువులు, బలం మరియు ఓర్పుకు ప్రసిద్ధి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించడానికి మరియు పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
4.8 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు రూ. 40 కోట్లు. ఈ రేంజ్ లో ధరతోఈ గిత్త గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో నిర్వహించిన వేలంలో ఈ జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈభారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అత్యధిక వెల పలికిన వియాటినా-19 గోవుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆవు ఇంతకుముందు కూడా పలు రికార్డులు నెలకొల్పింది. కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ఇది ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది. ఈ ఆవు అండాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుండడం గమనార్హం. అధిక ఉష్ణోగ్రతా పరిస్థితులను కూడా తట్టుకుని ఇవి మనుగడ సాగించగలవు. 1800 సంవత్సరాల్లో ఈ జాతి ఆవులు బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
Previous Articleమణిపూర్ లో రాష్ట్రపతి పాలన
Next Article 38వ నేషనల్ గేమ్స్ లో 18వ స్థానంతో ముగించిన ఏపీ