పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా , దర్శకులు క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు”.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం కోసం దాదాపుగా ఐదేళ్ల నుండి అభిమానులు ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం రెండో సాంగ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.
కాగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ పై సాగే డ్యూయెట్ సాంగ్ ను నేడు వాలెంటైన్స్ డే కానుకగా బ్యూటిఫుల్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈ సాంగ్ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మార్చ్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Happy Valentine's Day from #HariHaraVeeraMallu ❤️
Get ready to groove with the one and only Powerstar @PawanKalyan 🤩#Kollagottinadhiro is coming to STEAL YOUR HEART! 🫶🏻
Mark your calendars for Feb 24th, 3 PM! 🕺🏻💃🏻
A @mmkeeravaani Musical 🎹🎼@AMRathnamOfl @thedeol… pic.twitter.com/cq3nZ8HwsO
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) February 14, 2025