2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది వీర జవాన్లకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే. ఈ దుర్ఘటన జరిగి 6 ఏళ్లు అవుతున్నా.. ఈ దాడితో ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు.? దాడులకు సంబంధించి విచారణలో తేలింది ఏంటి ? భద్రత వైఫల్యం మీద ఎవరు భాధ్యత తీసుకున్నారు ? కాంగ్రెస్ పార్టీ అడిగిన ఇలాంటి ప్రశ్నలకు బీజేపి నుంచి ఇప్పటికీ సమాధానం లేదని పుల్వామా దాడిపై శ్వేతపత్రం అడిగితే విడుదల చేసే దమ్ము కేంద్రానికి లేదని విమర్శించారు.
కీలక సంస్కరణలు తెచ్చిన చిరస్మరణీయుడు మన సంజీవయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దామోదరం సంజీవయ్య గారి 104 వ జయంతి సందర్భంగా షర్మిల ఆ ఘన నివాళులు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికి, భూమి లేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల బంజరు భూములు పంపిణీ చేసి, వృద్ధాప్య పెన్షన్లు, బాలికలకు సాంకేతిక విద్య అందించే దిశగా కీలక సంస్కరణలు తెచ్చిన చిరస్మరణీయుడు మన సంజీవయ్యని షర్మిల కొనియాడారు.
వారి త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరవదు. దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read