సమాజ సేవకు ఎంత గానో కృషి చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
సమాజసేవలో 28 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు అభినందనలు. ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ… మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
మంత్రి నారా లోకేష్:
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి ఆలోచన, భువనేశ్వరిగారి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో ఒక్క అడుగుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి తెలియని వారు ఉండరు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగునీరు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మనస్సు గెలుచుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజల్ని అందరి కంటే ముందుగా భరోసా ఇచ్చేది, సాయం అందించేది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తితో మహిళలు సొంత కాళ్లపై నిలబడే శక్తిని ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి.
సమాజసేవలో 28 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్: చంద్రబాబు, లోకేష్ అభినందనలు
By admin1 Min Read