గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారని బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక వేత్త శ్రీ సేవాలాల్ మహరాజ్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక వేత్త శ్రీ సేవాలాల్ మహరాజ్: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read