ప్రస్తుతం భారత్‌లో చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గింది.ఈ మేరకు మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.గత ఏడాది 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.ఈ విషయాన్ని సెంట్రమ్ నివేదికలో పేర్కొంది. ఫిబ్రవరి 15, 2025 నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి 19.77 ఎంఎంటీ కాగా.. గత సీజన్ ఇదే సమయానికి కంటే 12శాతం తక్కువ.అయితే చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరకును వినియోగించడం వలన..చక్కెర ఉత్పత్తికి కొరత ఏర్పడిందని తెలుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లో చక్కెర ధరలు టన్నుకు రూ.41వేలు ఉండా.. మహారాష్ట్రలో టన్నుకు రూ.37,500 కంటే ఎక్కువగా ఉంది.ప్రభుత్వం ఇటీవల ఒక ఎంఎంటీ చక్కెర కోటా ఎగుమతికి ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఏడాది దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు