ఇటీవల ఒక కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెలిసిందే. కాగా, నేడు వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. ఆయనను కలిసి పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతోందని మండిపడ్డారు.వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు . పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పట్టాభిని సీఎం చంద్రబాబే పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని అన్యాయాలు చేసే వారిని బట్టలూడదీసి నిలబెడతానని జగన్ మండిపడ్డారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు