రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా రంగం నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. జిఎఫ్‌ఎస్‌టి నిర్వహించిన ఆక్వా టెక్ 2.0 కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఇక ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. పద్దతి ప్రకారం ఆక్వా సాగు చేస్తున్నవారిని ప్రోత్సాహిస్తామని తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యుత్ ఛార్జీలు సహా పలు కీలక నిర్ణయాలు ఆక్వా రైతాంగం విషయంపై తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆక్వా రైతాంగానికి అండగా ఉంటామని బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువ రుణాలు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా రంగం నిలవాలి:ఆక్వా టెక్ 2.0 కాన్‌క్లేవ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read