భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించబడిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) ఈ నెల 16న ప్రకటించింది. అమెరికా ప్రజల ట్యాక్స్ ల నుండి వస్తున్న డబ్బును వీటికి ఖర్చు చేయడం తగదని, కావున ఇకపై ఇలాంటి వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఇక ఈనిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తలూపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని భారత్ కు ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని చెప్పారు. భారత్‌కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దనే చాలా డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ లు కలిగిన దేశం అదే. వారి టారిఫ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ మరియు వారి ప్రధాని అన్నా మాకు చాలా గౌరవం. కానీ, ఓటింగ్ పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇచ్చే అవసరం మాత్రం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్ కు ఆ సాయం అవసరం లేదు…వారి వద్ద చాలా డబ్బుంది: డొనాల్డ్ ట్రంప్
By admin1 Min Read