తప్పు చేసిన వారి విషయంలో చట్టం తప్ప, రాజకీయ జోక్యం ఉండదని ఎవరు తప్పు చేసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. మిర్చి రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. 2027 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే నదుల అనుసంధానం గురించి కూడా చర్చించాం. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించాం. గత వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. తాము కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్‌జీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటామని వివరించారు.
తప్పు చేసిన వారి విషయంలో చట్టం తప్ప, రాజకీయ జోక్యం ఉండదు: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read