ఈ సంవత్సరం చివర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అర్హత సాధించాడు. అమెరికాలోని బోస్టన్లో జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ లో 5 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో గమ్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 2022లో థాయ్ లాండ్ అథ్లెట్ కీరెన్ టన్టేవాట్ (13 ని. 8.41 సె) నెలకొల్పిన ఆసియా రికార్డును అధిగమించాడు.. అలాగే 2025 ప్రపంచ ఛాంపియన్షిప్ స్టాండర్డ్ (13 ని 1.00 సె) అందుకున్నాడు. ఈ విభాగంలో అమెరికా అథ్లెట్ కోల్ హోకర్ (12 ని 59.43సె) గోల్డ్ గెలిచాడు. మరో అమెరికా అథ్లెట్ కూపర్ (12 ని 57.97 సె ) సిల్వర్, ఆస్ట్రేలియాకు చెందిన జాక్ రేనెర్ (12 నిమిషాల 59.43 సె, ) బ్రాంజ్ గెలిచారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్
By admin1 Min Read