గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.నిన్న అర్ద గంట వ్యవధిలోనే 2 సార్లు కాల్స్ చేసి చంపేస్తామంటూ రాజాసింగ్‌ను హెచ్చరించారు.దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ…తనకు 2 నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు.ఈ రోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షా అల్లా అని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు.
అయితే మీ యోగి, మీ మోదీ కూడా మా నుండి నిన్ను రక్షించలేరుని దుండగులు బెదిరించారన్నారు.మొదటి ఫోన్ కాల్ మధ్యాహ్నం 3.30 గంటలకు,ఆ తర్వాత 3.54 గంటలకు వచ్చినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు.గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి.అయితే తీవ్రవాద సంస్థల నుండి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఏర్పాటు చేసింది.