అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న అమృత్‌సర్ చేరుకున్న అమెరికా మిలటరీ విమానంలో 104 మంది, 15న మరో విమానంలో 119 మంది, 16న వచ్చిన మూడో విమానంలో 112 మందిని భారత్ కు పంపించి వేసింది. మూడు మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపింది. తాజాగా అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించగా…అక్కడి నుండి వారు నిన్న టర్కిష్ ఎయిర్ లైన్స్‌లో ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు. అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. అందులో భాగంగా అక్రమ వలసదారులను పనామాకు తరలిస్తోంది. అక్కడి నుండి వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నారు.
అమెరికా నుండి భారత్ కు చేరుకున్న మరికొందరు అక్రమ వలసదారులు..!
By admin1 Min Read