అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల్లో మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది.అక్కడి నుండి వారు నిన్న టర్కిష్ ఎయిర్ లైన్స్‌లో ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు.అయితే తొలిసారి వీరికి ఎలాంటి సంకెళ్లు వేయకుండా వెనక్కి పంపారు. అమెరికా ఇప్పటి వరకు 3 మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా, వారందరికీ సంకెళ్లు వేయడం తెలిసిందే.అయితే తాజాగా తిప్పి పంపిన 12 మందిని స్వేచ్ఛగా తరలించారు.
అక్రమ వలసదారులు ఏరివేయడంలో పనామా అమెరికాకు సహకారం అందిస్తోంది.దీనిలో భాగంగా అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది.అక్కడి నుండి వారు తమ దేశాలకు చేరుకుంటున్నారు.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 50 మంది భారతీయులను అమెరికా ఇటీవల పనామాకు తరలించింది.వారిలో 12 మంది నిన్న భారత్ కు చేరుకున్నారు.అయితే వీరందరూ స్వదేశాలు చేరుకునేందుకు ఐక్యరాజ్యసమితికు చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ సాయం అందిస్తుంది.ఈ మేరకువిమాన టికెట్లు కొనుగోలులో వారికి సాయం చేస్తోంది.