పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు.తాజాగా శశిథరూర్ స్పందిస్తూ…ప్రస్తుతానికి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని,పార్టీ కనుక నా సేవలను ఉపయోగించకూడదు భావిస్తే…నాకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు.శశిథరూర్ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని,కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు.దీనితో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో శశిథరూర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది.
అయితే దేశ,రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని, ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనకు చేతకాదని స్పష్టం చేశారు.నేను ఎప్పడూ సంకుచితంగా ఉండనని పేర్కొన్నారు.కాగా కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు.లేనిపక్షంలో వరుసగా 3వసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.కేరళ సీఎం పదవికి నేను అర్హుడినని పేర్కొన్నారు.అయితే పలు ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే అంశాన్ని చెప్పాయని శశిథరూర్ గుర్తు చేశారు.