మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’.దర్శకుడు వశిష్ఠ రొటీన్‌కి భిన్నంగా ఈ సారి సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.అయితే ‘విశ్వంభర’ అంటే ఓ లోకం…ఆ లోకానికీ..భూలోకానికీ సంబంధం ఏంటి? అసలు ఈ కథలో చిరంజీవి ఎవరు? వేరే లోకానికెళ్లి ఆయన సాధించేదేంటి? తదితర అంశాలన్నీ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తుంది.
గతంలో వచ్చిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు ఇది నెక్ట్స్ లెవల్‌గా ఉంటుందని సమాచారం.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.అయితే ఇందులో త్రిష పాత్ర చిరంజీవి పాత్రకు ధీటుగా ఉంటుందని చెబుతున్నారు.కాగా త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు.ఇందులో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్,కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.