కొల్లేరు సరస్సు, కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై నెలకొన్న పర్యావరణ మరియు చట్టపరమైన సవాళ్ల పరిష్కారంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి, ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కొల్లేరు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అటవీ శాఖ ఉనతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొల్లేరు పరిధిలో విభిన్న వృత్తులపై ఆధారపడ్డ సమూహాలకు స్థిరమైన జీవనోపాధులను మెరుగుపరుస్తూనే కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. వసుధైక కుటుంబ అనే మన జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రకృతినీ, ప్రకృతిలో భాగమైన జీవజాలాన్నీ కాపాడుకొందామని ఈ సవాళ్ళ సమగ్ర పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి కొల్లేరు ప్రాంతవాసుల ప్రాథమిక డేటాను – పరిపాలనా, పర్యావరణ మరియు సామాజిక అంశాల సేకరించి అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల మరియు అటవీ శాఖల అధికారులతోపాటు ఈ ప్రాంతంలో భాగమైన వర్గాలతో కూడా సంప్రదింపులు చేయాలని తద్వారా జీవనోపాధుల మెరుగుదల, పర్యావరణ చట్టాల అమలు మధ్య సమతుల్య విధానాన్ని పాటించగలమన్నారు.
జీవనోపాధులను మెరుగుపరుస్తూనే కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read