ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి ఒక్క రోజు కూడా విరామం లేకుండా నిత్యం ప్రజా సేవలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా ఫిట్ గా చూసుకుంటారు. కాగా, తాజాగా ఆయన తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి తెలిపారు. బీహార్‌లోని భాగల్‌పుర్‌లో తాజాగా పర్యటించిన ఆయన . ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించారు. మఖానా (తామర విత్తనాలు) మంచి ఆహారమని అన్నారు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అని వివరించారు. తాను 365 రోజుల్లో 300 రోజులు మఖానాను అహారంలో భాగంగా చేసుకుంటానని తెలిపారు. దేశ వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు అల్పాహారంగా మఖానాను తీసుకుంటున్నారన్నారు. అందుకు అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా రైతుల శ్రేయస్సు కోసం బీహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. మఖానా బోర్డు ప్రకటించినందుకు సభలో ప్రధానికి మఖానాతో తయారు చేసిన మాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
మఖనా మంచి ఆహారం…300 రోజులు ఆహారంలో భాగంగా తీసుకుంటా: ప్రధాని మోడీ
By admin1 Min Read