నిన్న సభలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు బాధగా అనిపించిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని గవర్నర్ ప్రసంగిస్తుండగా నవ్వుతూ జగన్ వ్యవహారం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నిన్నటి సభలో జగన్ తీరు సభ్యతగా ఉందా ? జగన్ వ్యవహరించిన తీరు సరికాదు. ఇది ప్రజాస్వామ్యమని జగన్ గుర్తుంచుకోవాలి. సీఎంగా, ఎంపీగా చేసిన వ్యక్తి సభలో వ్యవహరించే తీరు ఇదేనా? అని అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. ఇక నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన వైసీపీ నేతలు కొద్దిసేపటికే బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుండగా… టీడీపీ నేతలు వైసీపీ తీరును ఎద్దేవా చేస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు