తమిళనాడు మాజీ సీఎం,జయలలిత 77వ జయంతి సందర్భంగా నిన్న చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు.ఈ మేరకు ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళుర్పించారు.అనంతరం జయలలిత మేనకోడలు,మేనల్లుడితో రజనీకాంత్ కొద్దీ సేపు మాట్లాడారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ… సినీ పరిశ్రమలో జయలలిత ఎంతో బిజీగా ఉన్నప్పుడే ఆమెతో నటించే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. 1977లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని… ఆమెతో ఆ చిత్రం గురించి మాట్లాడేందుకు మొదటిసారిగా ఆమె నివాసానికి వచ్చానని చెప్పారు.ఆమె మన మధ్య లేకపోయినా…జయలలిత అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు.జయలలిత కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని రజనీకాంత్ అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు