‘స్పా’ ముసుగులో జరుగుతున్న వ్యభిచార కేంద్రంలో పోలీసులకు దొరికిన వైసీపీ నాయకుడు,ఏపీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య సోమశంకర్ నాయక్‌ను పార్టీ నుండి బహిష్కరించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.విజయవాడలోని వెటర్నీ కాలనీలో ‘స్టూడియో 9 స్పాప్’ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారంతో ఇటీవల మాచవరం పోలీసులు దాడులు చేశారు.పోలీసుల దాడి గురించి తెలుసుకున్న శంకర్‌నాయక్ గదిలో మంచం కింద దాక్కున్నారు.గుర్తించిన పోలీసులు ఆయనను బయటకు లాగారు.ఈ అంశంపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా శంకర్ నాయక్ గారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. pic.twitter.com/xVZoyTbtKh
— YSR Congress Party (@YSRCParty) February 24, 2025