ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బీ.ఆర్.అంబేద్కర్, భగత్ సింగ్ లో ఫోటోలు తొలగించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. నేటి ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం అతీషీ సహా 12 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కాగ్ (CAG) ఇచ్చిన నివేదికను నేడు బీజేపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వారు ఈ అంశాన్ని ప్రజలు దృష్టి నుండి మరలించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం కార్యాలయంలో బీ.ఆర్.అంబేద్కర్, భగత్ సింగ్, రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల ఫోటోలు ఉన్నాయని తెలుపుతూ ఒక ఫోటోని విడుదల చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ: మాజీ సీఎం అతీషీ సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
By admin1 Min Read
Previous Articleశంకర్‌నాయక్ ను పార్టీ నుండి బహిష్కరించిన వైసీపీ….!
Next Article కేంద్ర మంత్రితో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెల్ఫీ..!