గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీనేతలతో ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేలా అందరూ పనిచేయాలని కోరారు. ఎన్నికల ముందురోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ చార్జి మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.
తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించేలా అందరూ కలిసి పనిచేయాలి: మంత్రి లోకేష్
By admin1 Min Read