ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025లో సంచలన విజయం నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ పై గెలిచింది. ఇరు జట్ల నుండి 300కు పైగా పరుగుల భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడం ఖరారైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 177 (146; 12×4, 6×6) భారీ సెంచరీతో సత్తా చాటాడు. అజ్మతుల్లా 41 (31; 1×4, 3×6), షాహిది 40(67; 3×4) , నబీ 40 (24; 2×4, 3×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, లివింగ్ స్టోన్ 2 వికెట్లు, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ 120 (111; 11×4, 1×6) సెంచరీతౌ పోరాడాడు. బట్లర్ (38), బెన్ డకెట్ (38), జేమీ ఓవర్టన్ (32), హ్యారీ బ్రూక్ (25) పరుగులు చేశారు. చివరి ఓవర్లో ఆ జట్టు గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా… కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బి నుంచి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఇంగ్లండ్ వరుసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు