భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ పై ప్రశంసలు కురిపించారు. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది. దాదాపుగా 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మహా ఆధ్యాత్మిక వేడుకను అటు సంప్రదాయం, టెక్నాలజీ, వాణిజ్యం, ఆధ్యాత్మికతల మేలు కలయికగా హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అభివర్ణించారు. ఈ వేడుక నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని, అవకాశాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ”insights from the world’s largest spiritual gathering Mahakumbh” పేరుతో ప్రత్యేక చర్చా వేదికను ఏర్పాటు చేసింది. పలువురు ప్రొఫెసర్లు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Previous Articleఇంగ్లండ్ పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం..!
Next Article అస్సాంలో భూప్రకంపనలు..!