బీజేపీ డీఎంకేల మధ్య హిందీ విషయంలో మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే అగ్రనేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ వలనే ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయి అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల సోదర సోదరీమణులారా… హిందీ వలన ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో గమనించారా? భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రజ్, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి ఇంకా అనేక భాషలు ఇప్పుడు మనుగడ కోసం వెతుకుతున్నాయని పేర్కొన్నారు. యూపీ, బీహార్ లు హిందీ రాష్ట్రాలు కావని వారి అసలైన భాషలు ఇప్పుడు గతానికి సంబంధించిన అవశేషాలని రాసుకొచ్చారు. ఇది ఇక్కడ మనకు తెలుసు కాబట్టే తమిళనాడు ప్రతిఘటించిందని అన్నారు. తమిళం మేల్కొంది; తమిళ సంస్కృతి ప్రాణాలతో బయటపడిందని పేర్కొన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. హిందీ ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తమిళనాడు లోని డీఎంకే ప్రభుత్వం మాత్రం తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని స్పష్టం చేస్తోంది. దీనిపై కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది.
హిందీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్..!
By admin1 Min Read