తమ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ సాయంతో తమ రాష్ట్ర ఓటర్ల జాబితాలోకి ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను చేర్చుకున్నారు నుండి తీవ్ర ఆరోపణలు చేశారు. సత్వరం తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. 2006లో భూసేకరణ ఆందోళన క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహారదీక్షను ఈసందర్భంగా ఆమె గుర్తు చేశారు. టీఎంసీ సమావేశంలో మాట్లాడిన ఆమె ఎలక్షన్ కమీషన్ ను కూడా బీజేపీ ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇటీవలే సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ నియామకం పైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ ఫలితాలను తారుమారు చేసేందుకు గుజరాత్, హార్యానా ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఇటువంటి వ్యూహాలు అమలు చేసిందని ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో 294 స్థానాలకు 215 చోట్ల తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిరవధిక దీక్ష చేస్తా…ఈసీ, బీజేపీపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్..!
By admin1 Min Read