ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడుతోంది.అయితే ఒకే వేదికలో మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా భారత్‌కు అదనపు ప్రయోజనం కలుగుతోందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ అథర్టన్,నాజర్ హుస్సేన్‌లు ఐసీసీ తీరును తప్పుబట్టారు.ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు భారత్ కు కలసి వస్తాయని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షల్ గిబ్స్ స్పందించాడు.ఆయన వారి వాదనలను తప్పుబట్టాడు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ సందర్భంగా మైకేల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌పై స్పందించాడు.ఇదో పనికిమాలిన వాదనని, బయటి విషయాలు పట్టించుకోకుండా ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు టీమిండియా నిరాకరించింది.ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపింది.దాంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా భారత్-పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదిర్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు