విశాఖపట్నం గీతమ విశ్వవిద్యాలయంలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 సంస్థలతో యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. 2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా లోకేష్ పిలుపునిచ్చారు.
విశాఖ గీతమ్ విశ్వవిద్యాలయంలో కెరీర్ ఫెయిర్… పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleవర్షంతో రద్దయిన పాకిస్థాన్ బంగ్లాదేశ్ మ్యాచ్… ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించిన పాక్
Next Article ఇది ఓ పనికిమాలిన వాదన :- హెర్షల్ గిబ్స్