ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాలవిద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జిఓ 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈనెల 3వతేదీన శాసనసభ్యులతో వర్క్ షాపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. పీజీ ఫీజు రీఎంబర్స్ మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరారు. అమరావతిలో ఎఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చెయ్యాలని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్ పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లీప్ ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
By admin1 Min Read