సీనియర్ ఐపీఎస్ అధికారి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఆయన విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతిగా ఉన్న రఘురామ కృష్ణంరాజును వేధించిన కేసులో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2020 నుండి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుసార్లు విదేశాలకు వెళ్లి ఆలిండియా సర్వీసు నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

