అతిపెద్ద క్రికెట్ ఎంటర్టైన్మెంట్ టోర్నీ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ ఈనెల 22 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కొన్ని ఆంక్షలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం ఒక్కో టీమ్ కు ఏడు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే రెండు వార్మప్ మ్యాచ్ లు మాత్రమే అనుమతిస్తారు. మ్యాచ్ జరిగే రోజుల్లో స్టేడియంలో ప్రాక్టీస్ కోసం అనుమతించారు. ఐపీఎల్ వేదికలలో మిగిలిన టోర్నీలను నిర్వహించరాదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌లోని సైడ్ వికెట్‌లలో ఒకదానిపై జరగాలి. ఫ్లడ్ లైట్ల కింద కేవలం 3.30 గంటలు మాత్రమే ప్రాక్టీస్‌కు అనుమతి ఉండనుంది. ఆపరేషనల్ రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బీసీసీఐ ముందస్తు వ్రాతపూర్వక అనుమతి అవసరం ఉంటుంది. ఇక ఈ సీజన్ కోసం పిచ్ సిద్ధం చేసేందుకు సంబంధిత ఫ్రాంచైజీ సీజన్ లో మొదటి హోమ్ మ్యాచ్ కు ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్‌లో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్ లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదు. రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే సెషన్ల వారీగా అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు కొత్త నిబంధనలను బీసీసీఐ నోట్ ద్వారా ఐపీఎల్ జట్లకు తెలియజేసిందని ఒక క్రీడావార్త కథనం పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు