వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ముందు బేసిక్ సదుపాయాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని MNREGS నిధులతో దశలవారీగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని లోకేష్ వివరించారు. 117 జీవోపై శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. గంజాయి నివారణకు ‘ఈగల్’ లాంటి సంస్థ ఏర్పాటు చేసామని చెప్పారు. నాడు-నేడు అవినీతి పై విచారణ చేస్తున్నాం. నివేదిక రాగానే సభ ముందు పెడతామన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు