నేచరుల్ స్టార్ నాని మరోసారి రా అండ్ రస్టిక్ ఊర మాస్ కథాంశంతో ‘ప్యారడైజ్’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు.నానితో ‘దసరా’ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజగా ఈ చిత్రానికి సంబంధించిన ‘రా స్టేట్మెంట్ గ్లింప్స్’ను విడుదల చేశారు.మదర్స్ రా స్టేట్మెంట్స్, సన్ రెవల్యూషన్ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్‌ను రూపొందించారు.ఇందులో నాని గెటప్, ఆయన పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది.
కాగా ఈ గ్లింప్స్ చూస్తున్నంత సేపు దర్శకుడు అందరినీ ‘ప్యారడైజ్’ సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది.ఈ చిత్ర బడ్జెట్ కూడా నాని కెరీర్లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని ఎస్విఎల్ సినిమాస్ నిర్మిస్తుంది.ఇందులో సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తుంది. 2026 మార్చి 26న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.