సీఎం చంద్రబాబు మాటలు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై మండిపడ్డారు. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు. మా పార్టీకి మీలాగా రంగుల పిచ్చ లేదు. మా ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వస్తాయి. కుల, మత, జాతి, వర్గం, పార్టీ అనే భేధం లేకుండా అందరికీ మేలు చేయాలనేదే ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మంత్రి శాసనమండలి వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము పరిపాలన చేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.
పేదరికమే ప్రామాణికం…అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు: మంత్రి అచ్చెన్నాయుడు
By admin1 Min Read
Previous Articleత్వరలో డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ..!
Next Article నాని ‘ప్యారడైజ్’ గ్లింప్స్ విడుదల…!