ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం అందుకున్నారు. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు. సమాచారం అందే సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన విజయం సాధించారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి అభ్యర్థులు… భారీ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్
By admin1 Min Read