ఏపీ సీఎం చంద్రబాబును సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ మోసానికి గురైన బాధితురాలు కలిశారు. సచివాలయం నుండి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలివచ్చిన చిట్ ఫండ్ బాధితులను చూసి సీఎం చంద్రబాబు వారి వద్దకు వెళ్లారు. సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు. సుమారు 600 మంది ఈ ఘటనలో నష్టపోయారు. కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని సీఎం కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి వారికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని…. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలివచ్చిన చిట్ ఫండ్ బాధితులను చూసి వారి వద్దకు వెళ్లాను. సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు. సుమారు 600 మంది ఈ ఘటనలో నష్టపోయారు. కష్టపడి సంపాదించుకుని దాచుకున్న… pic.twitter.com/VJgoVuQJxT
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2025