ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదేనని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘనవిజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమనీ ఈ విజయం ఒక చరిత్రని పేర్కొన్నారు . పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుందని ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన దమ్మున్న పార్టీ టీడీపీ. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు