భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో వివిధ ఫార్మాట్లలో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డుని సృష్టించాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చడంతో ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్ గా నిలిచాడు. అయితే వీటిలో టీ20 వరల్డ్‌కప్ లో మాత్రమే సౌతాఫ్రికా పై భారత్ గెలిచి ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2007, 2011, 2013లో వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో టీ20 ప్రపంచ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్‌కు టైటిల్స్ అందించాడు. అయితే ధోనీ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యే నాటికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కాలేదు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు